మెల్లగ వీచే ఓ చల్లని చిరు గాలి
నీవైనా చెప్పవే నా సరి జోడిని రమ్మని
కలిసే ఉంటావు నీవు వారిని
మరి చెప్పొచ్చు గా నను కలవమని
అతనెవరో నీకు తెలుసులే కాని
నను బ్రతిమిలాడకు ఆ పేరును పలకమని.
తెలుపు ప్రతి క్షణం తన ఆలోచనలతోనే నిండింది నా మది అని
ఓ చల్లని చిరుగాలి విన్నవించుకుంటున్న అతని ఆచూకీ తెలపమని
----
చిరు గాలి చల్లగా మోసుకొచ్చింది ఏదో రాయబారం అందించాలని
ఇటు వైపు గా వీస్తుంది మెల్లగా చెవిలో ఏవో ఊసులాడాలని
తానొస్తున్నాడన్న సందేశంవిని
సంబరంలో రంగుల హరివిల్లయింది నా మనసని
పురి విప్పి నాట్యం చేస్తున్న నన్ను చూసి కన్ను గీటింది అతనేనని
నా మనసులోని హరివిల్లును అతను పసిగట్టేనని
వాన చినుకులకు ఆకాశంలో మెరిసే హరివిల్లే దానికి ప్రతిబింబమని
సంబరాలు అంబరానంటాయంటే ఇదేనేమోనని
మురిసిపోతూ వెనుతిరిగింది గాలి వెళ్ళొస్తానని.
Poem by Ms.Shravanthi Satyavarapu.
0 Comments